మహిళలకు ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రత్యేక ప్రోత్సాహాం అందిస్తోంది

నవతెలంగాణ-అడిక్‌ మెట్‌
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తూ మహిళా సంక్షేమంలో యావత్‌ దేశా నికే ఆదర్శంగా నిలుస్తుందని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గాంధీ నగర్‌ డివిజన్‌లోని జవహర్‌నగర్‌ ఎస్‌ఆర్‌టి కమ్యూనిటీ హాల్‌ తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ తిప్పర్తి యాదయ్య, హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ము ఠా గోపాల్‌ మాట్లాడుతూ. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ విప్లవాత్మక పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవే ేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని కొనియా డా రు. ప్రభుత్వం అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడు తుందన్నారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెలకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా.. ఆడ బిడ్డలకు మేనమా మలా.. అవ్వలకు పెద్ద కొడుకులా.. కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మనసారా ఆశీర్వదిం చాలన్నారు. మహిళా సాధికారతలో తెలంగాణకు తిరుగు లేదన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహ, డివిజన్‌ అధ్య క్షులు రాకేష్‌ కుమార్‌, మాజీ కార్పొరే టర్‌ ముఠా పద్మ నరేష్‌, జిహెచ్‌ఎంసి ఏ ఎం ఓ హెచ్‌ మైత్రి, నోడల్‌ ఆఫీసర్‌, పవన్‌ కుమార్‌, డిపిఓ సుధాకర్‌ రావు, ముషీరాబాద్‌ మండల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ చందన, డాక్టర్‌ మానస, లక్ష్మీ గణపతి దేవస్థానం చైర్మన్‌ మచ్చకుర్తి ప్రభాకర్‌,సూపర్‌ వైజార్‌లు కవిత, జ్యోతి, అంగన్వాడీ టీచర్‌లు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
స్వామివారి ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తాం

Spread the love