అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల సొంతింటి కల సహకారానికి సన్నద్ధం అవుతున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు నాలుగున్నర లక్షలు మంజూరు చేస్తూ కావలసిన నిధులు కేటాయించడం జరిగిందని, 4:30 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.7700 కోట్లు అవసరమని, ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 3500 చొప్పున ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు, ఐదు సంవత్సరాల కాలంలో పేదలకు 22 లక్షల 50, వేలు ఇండ్లు నిర్మించడానికి ప్రభుత్వం కార్యాచరణతో ముందుకెళ్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందని, సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని తెలిపారు. సొంత ఇంటి కోసం పేదలు అందజేసిన దరఖాస్తులను పరిశీలన కోసం కార్యాచరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.