బీసీలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

The government should immediately implement the assurance given to the BCs

నవతెలంగాణ – ధర్మసాగర్

సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజులను బిసి-డి నుంచి బీసీఏకి మారుస్తానని ఇచ్చినా హామీని వెంటనే అమలు చేయాలని జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ముదిరాజుల ర్యాలీని నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసిల్దార్ సదానందంకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ముదిరాజులను బి సి డి నుండి బీసీఏ కి మార్చారని, దానిని కొందరు కోర్టు స్టే ఆర్డర్ తీసుకొని రావడంతో ఇప్పటివరకు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు.ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులకు  హామీని వెంటనే అమలు చేయాలని సందర్భంగా కోరారు.ముదిరాజ్ కులస్తుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లతో ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.బిసి-డి నుండి బిసి ఏ లోనికి మార్చాలని జిల్లా  మత్స్యశాఖ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్మసాగర్ మండల కేద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ  పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మైనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా  అభయహస్తం లో  ముదిరాజులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం ముదిరాజులకు  ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేస్తే ముదిరాజులకు ఉపయోగకరంగా ఉంటుందని వారు కోరారు. చెరువులు కుంటల పై ముదిరాజులకు సంపూర్ణ హక్కులు కేటాయించాలన్నారు.త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచి మహేందర్ , పెసరు రమేష్ , మత్స్యశాఖ నాయకులు కార్మికులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love