ప్రభుత్వం హామీలు అమలు చేయాలి

ప్రభుత్వం హామీలు అమలు చేయాలి
ప్రభుత్వం హామీలు అమలు చేయాలి

నవతెలంగాణ వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశంపార్టీ మండల అధ్యక్షులు పెడతానపల్లి రాములు అధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ తహశీల్దార్ ఉమారాణికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు పెడతానపల్లి రాములు మాట్లాడుతు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం రైతులకు నిరుద్యోగులకు మహిళలకు మైనార్టీలకు గిరిజనులకు దళితులకు తదితర వర్గాలకు ఇచ్చిన హామీలు అమలుపరచలేదు. ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న హామీని విస్మరించారు. 22 లక్షల పైగా ఇల్లు లేని పేదలు ఉంటే దాదాపు మూడు లక్షల డబుల్ బెడ్ రూమ్ నిర్మిస్తామని చెప్పి కొన్నిటిని నిర్మాణం చేసి పంపిణీ చేయకుండా వదిలేశారు. అంతేకాకుండా ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం విస్మరించిందన్నారు.
ఈ మధ్యనే గృహలక్ష్మి పేరుతో మూడు లక్షల రూపాయలు ఇస్తామని దరఖాస్తులకు మూడు రోజుల సమయం కేటాయించి ప్రజలను మోసం చేసి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. అకాల వర్షాల వలన నష్ట పోయిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పి రైతులను విస్మరిచ్చిందన్నరు.తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అబ్బనవేణి ఆశయ్య, ఉపాధ్యక్షులు నిరటి స్వామి, గొల్లపల్లి రాజాం, కార్యదర్శిలు దాసరపు నారాయణ, గొల్లపల్లి శంకర్, సలహా దారులూ చొప్పరీ నర్సింగం, మండల యూత్ అధ్యక్షులు బరిగెల కృష్ణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love