ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి..!

– 9వ రోజు వంటవార్పు అంగన్వాడి ఉద్యోగుల నిరసన 
– ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రరెడ్డి , సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. భాస్కర్
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : అంగన్వాడీల పట్ల మొండి వైఖరి వీడాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రరెడ్డి , సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. భాస్కర్  అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడి ఉద్యోగుల సమ్మె 9వ రోజు సందర్భంగా వంటవార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ సందర్భంగా వారికీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రరెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా  మొండిగా వ్యవహరించడం సరైనది కాదని విమర్శించారు. అంగన్వాడి ఉద్యోగులు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ అనేక రకాల సేవలు అందిస్తున్నారని తెలిపారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయకుండా అంగన్వాడి ఉద్యోగులచే వెట్టిచాకిరి చేయించుకుంటుందని మండిపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ,రిటైర్మెంట్ బెనిఫిట్ ఆయాకు ఐదు లక్షలు టీచర్ కు 10 లక్షలు ఇవ్వాలని, అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని ,రిటైర్ అనంతరం వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి వీరి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనియెడల ఈ సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా కోశాధికారి పద్మ ,నాగరాణి ,విజయ ,పద్మ, సుమతి ,బాబాయ్ ,లక్ష్మి ,రమ, మంజుల , నసీమ ,పుష్ప, తదితరులు పాల్గొన్నారు.
Spread the love