– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-తొర్రూరు
మహిళలు పారిశ్రామికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్య మని, మహిళలు బాగుపడితేనే దేశం, రాష్ట్రం, కుటుంబం, సమాజం బాగుపడుతుందని ఈ క్రమంలోనే పైలట్ ప్రాజె క్టుగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉచిత కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని విజయవంతం గా శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ ఉపాధి, ఉద్యోగావకా శాలు కల్పిస్తున్నామని, ఎర్రబెల్లి ట్రస్టు, మరికొందరి సహకా రంతో మిగతావాళ్ళందరికీ శిక్షణ ఇప్పిస్తున్నామని, మహి ళలు సైనికుల్లా తయారు అవ్వాలని, మీకు సాయంగా నిలి చిన కెసిఆర్‌కు, నాకు మీరంతా అండగా నిలవాలని అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలకు పిలుపునిచ్చా రు. బుధవారం స్థానిక ఎల్ణ్‌వైఆర్ గార్డెన్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల మ హిళలకు సర్టిఫికేట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి, మహిళలనుద్దేశించి మాట్లాడారు. 5 కోట్ల 10 లక్షల రూపా యలతో పాలకుర్తిలో ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు, 10 వే ల మందికి శిక్షణ ఇవ్వటం నా లక్ష్యం అని, మొదటి విడతగా 3వేల మందికి శిక్షణ ఇస్తున్నామని, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి కుట్టు మిషన్లు, సర్టిఫికేట్లు పంపిణీ చేస్తున్నాను అని మంత్రి వివరించారు. అందరికీ శిక్షణ ఇచ్చే బాధ్యత నాదని, ప్రభుత్వ శిక్షణ పూర్తి అయిన చోట్ల ఎర్రబెల్లి ట్రస్టు, ఇతర దాతల సహకారంతో శిక్షణను కొనసాగిస్తున్నానని, ప్రస్తుతం కే.నరసింహ రెడ్డి (కే.ఎన్.ఆర్ కంపనీ) ద్వారా గౌతమ్ జైన్, ఫోకర్ణ గ్రానైట్స్ ప్రైవేటు లిమిటెడ్, సి.యస్.ఆర్ ఫండ్ సమ కూర్చటం జరిగిందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ తీసుకున్న మహిళలతో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.ఇప్పటివరకు పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలలో 33 సెంటర్లు ఏర్పాటు చేసి, 3వేల 861 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.తొర్రూర్ మం డలంలో 605 మందికి, తొర్రూర్ మునిసిపాలిటిలో200 మందికి, రాయపర్తి మండలంలో 798 మందికి, పెద్దవం గర మండలంలో 404మందికి,పాలకుర్తి మండలంలో 753 మందికి, దేవరుప్పుల మండలంలో 702 మందికి, కొడకండ్ల మండలంలో 399 మందికి,మొత్తం నియోజకవర్గంలో 3 వే ల 861 మందికి శిక్షణ పూర్తీ చేయడం జరిగిందని తెలి పారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధి త శాఖల అధికారులు, మహిళలు పాల్గొన్నారు.