– హామీలు నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాడుతాం
– రుణమాఫీని వెంటనే చేయాలి
నవతెలంగాణ-భీంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చి రైతులకు రైతుబంధు 15 వేల రూపాయలు రెండు లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని లేకుంటే ప్రజల పక్షన పోరాడుతానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జాగిర్యాలలో గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన బస్తీ దావకాన, 20 లక్షలతో నిర్మించిన ఒక్కో గ్రామపంచాయతీ రూప్లా తండా , దేవన్ పల్లి, లింగపూర్ గ్రామపంచాయతీ నూతన భవనాలు 12 లక్షలతో పల్లికొండ గ్రామంలో బస్తీ దావకాన, 20 లక్షలతో పిప్రి గ్రామంలో బస్తీ దావకాన, బడా భీంగల్ లో మూడు లక్షలతో నిర్మించిన బస్ షెల్టర్ ను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిందని అలాగే వారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను మరియు రైతులకు ఎకరాకు 15 వేల రూపాయల రైతుబంధు తో పాటు 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలన్నారు లేకుంటే ప్రజల తరఫున నిరంతరం పోరాడుతానని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను నేడు ప్రారంభించుకున్నామని ఈ బస్తీ దవాఖానాలలో ఎంబిబిఎస్ డాక్టర్ ను నియమించేందుకు కెసిఆర్ అంగీకరించారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటిలో ఎంబీబీఎస్ డాక్టర్ ను నియమించి అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచి ప్రజలకు సౌకర్యవంతం చేయాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎంపిపి మహేష్,జెడ్పిటిసి రవి మండల పార్టీ అధ్యక్షలు నరసయ్య,సర్పంచ్ లు ప్రవీణ్ కుమార్, మానస శ్రీనివాస్, దేవాయి గంగాధర్, ఎంపిటిసి లు,మండల నాయకులు,కార్యకర్తలు మరియు ,అధికారులు పాల్గొన్నారు.