భార్య, పిల్లలను చంపి..గన్‌మెన్‌ సూసైడ్‌

– ఆర్థిక సమస్యలే కారణం కావొచ్చని అనుమానం
– ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి.. తాకతుకు మించి అప్పులు!
– పొలం అమ్మినా తీరని అప్పు.. మనస్తాపంతో అఘాయిత్యం?
– పాఠశాలకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చి మరీ హతమార్చిన వైనం
నవతెలంగాణ-చిన్నకోడూరు
ఆన్‌లైన్‌ గేమ్స్‌ మూలాన ఓ కుటుం బం మృత్యు ఒడికి చేరింది. కాలక్షేమానికి మొ దలెట్టిన ఆట.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బెట్టింగ్‌ వరకు వెళ్లింది. వందలు, వేలు, లక్షల్లో అప్పులు అయ్యేలా చేసింది. పొలం అమ్మినా అప్పు తీరలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌.. తన భార్య, ఆరేండ్ల లోపు ఉన్న కూతురు, కొడుకును తన సర్వీస్‌ రివాల్వర్‌తోనే కాల్చి చంపి.. ఆపై తానూ కాల్చుకుని మృతి చెందాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామునిపట్ల గ్రామంలో శుక్రవారం జరిగింది. రక్తపు మడుగులో ఉన్న ఆ కుటుంబాన్ని చూసి గ్రామం మొత్తం శోక సంద్రమైంది. చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మి, రాములు దంపతుల కుమారుడు ఆకుల నరేశ్‌ 2013లో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌గా ఎంపిక య్యాడు. ఆయనకు సిద్దిపేట జిల్లా కోహేడ మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన చైతన్యతో వివాహం జరుగగా కుమారుడు రేవంత్‌(6), కుమార్తె రిషిత(5) ఉన్నారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పా టిల్‌ వద్ద (పీఎస్‌ఓ/గన్‌మెన్‌) వ్యక్తిగత భద్రతా అధికారిగా నరేశ్‌ విధులు నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్‌ గేమ్స్‌తో ఆర్థిక చిక్కులు..
కాలక్షేపానికి చిన్న మొత్తాలతో మొదలైన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, రమ్మి లాంటి ఆటలు నరేశ్‌ను అప్పుల ఊబిలోకి లాగాయి. తనకు వారసత్వంగా వచ్చిన 30 గుంటల భూమి ని అమ్మినా.. అప్పు తీరలేదు. దానికి తోడు తోటి ఉద్యోగులు ఆర్థికంగా స్థిరపడటం, మరో వైపు బందువులలో చులక నభ ావంతో చూడటంతో ఒకింత తీవ్ర మనోవేదనకు గురj ూ్యడు. ఈ నేపథ్యంలో భర్య, పిల్లలను హతమార్చి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
విధుల్లో ఉన్న సమయంలోనే అఘాయిత్యం..
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో అప్పులు పెరిగి కుటుంబంలో గొడ వలకు దారితీసింది. ఇదే విషయమై తాజాగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో ఆగ్రహానికి గురైన నరేశ్‌.. పాఠశాలకు వెళ్లి పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడు. ఓ పక్క అప్పుల కుప్పలు.. మరోపక్క కుటుంబంలో గొడవ జరగ డంతో తీవ్ర మనస్తాపానికి గురై.. కుమారుడు రేవంత్‌(6)ను, కుమార్తె రిషిత(5)ను, భార్య చైతన్య(30)ను తన సర్వీస్‌ రివా ల్వర్‌తో కాల్చి హతమర్చాడు. ఆపై తానూ కూడా కాల్చుకుని మృతి చెందాడు. కాగా నరేశ్‌ శుక్రవారం డ్యూటీలో ఉండగానే ఈ ఘటనకు పాల్పడినట్టు సీపీ తెలిపారు.
గ్రామంలో తీవ్ర విషాదం
చిన్ననాటి నుంచి కుటుంబ సభ్యులతో, స్నేహితులు, గ్రామస్థులతో నరేశ్‌ కలుపుగోలుగా ఉండేవాడు. అంతేకా కుండా మంచి ఉద్యోగం, పేరు సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఆన్‌లైన్‌ గేమ్స్‌ బారిన పడి.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్కూల్‌ డ్రెస్సులోనే ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రులతోపాటు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి అందరినీ కలిచివేసింది.

Spread the love