– కూసుమంచి ఉన్నత పాఠశాలలో అరుదైన ఘటన
– ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. వీరస్వామి
నవతెలంగాణ-కూసుమంచి
కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు శిష్యులు ఒకే చోట పని చేయడం విశేషం. ఇటీవల పాఠశాల గెజిటెడ్ ఉపాధ్యాయుల బదిలీల నియామకం కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్. వీరస్వామి ప్రధానోపాధ్యాయులుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటికే అదే స్కూల్లో ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతల్లో వున్న రేలా విక్రమ్ రెడ్డి ప్రస్తుతం బాధ్యతల స్వీకరించిన ప్రధానోపాధ్యాయులు విక్రమ్ రెడ్డికి విద్య బుద్దులు నేర్చిన గురువు కావడం విశేషం. నిన్న జరిగిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలతో కూసుమంచి పాఠశాలలో ఒక విశేషం చోటు చేసుకుంది. శిష్యుని నుండి పాఠశాల బాధ్యతలు స్వీకరించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే పాఠశాల లో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సంక్రాంతి రవి కుమార్ కూడా వీర స్వామి శిష్యుడు కావడం మరో విశేషం. ఇది యాధృచ్చికం అయినప్పటికీ గురు శిష్యులు ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేయడం నిజంగా విశేషమే. వీర స్వామి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నారు. విక్రమ్ రెడ్డికి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు రావడంతో అభినందనలు తెలియజేశారు. ఇదే పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా ఉన్న ఆళ్లగడప శ్రీనివాస రావు, ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న డాక్టర్.తేజావత్ శోభన్ బాబు ఇద్దరూ ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఇక్కడే ఉపాధ్యాయులుగా పని చేస్తుండటం మరొక విశేషం.