పేదల గూడు చెదిరే.. గుండె పగిలే..

భూకబ్జాదారుల చేతుల్లో సమిధలవుతున్న అమాయక ప్రజలు
– సుమారు 500 అక్రమ నిర్మాణాలకు పైగా కూల్చివేతలు
 ప్రభుత్వ భూములు మింగేస్తున్న భూబకాసురులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, వత్తాసు పలుకుతున్న ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్‌ మండల రెవెన్యూ పరిధిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేయడంతో పేదలు రోడ్డున పడ్డారు. తక్కువ ధరకు స్థలాలు ఇస్తామని దళారులు నమ్మబలకడంతో పేదలు తమ బంగారం తాకట్టు పెట్టి ఇండ్లు కట్టుకున్నారు. అయితే అవి అక్రమ నిర్మాణాలు అంటూ తాజాగా అధికారులు నేలమట్టం చేశారు.
     కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్‌ మండల రెవెన్యూ పరిధి ,గాజుల రామారం, జగద్గిరి గుట్ట డివిజన్‌ల పరిధి లోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు భూకబ్జాదా రులకు, అక్రమార్కులకు బంగారు బాతు గుడ్డుగా మారింది. గాజుల రామారం డివిజన్‌ పరిధి దేవేందర్‌ నగర్‌ ,కైసర్‌ నగర్‌ ,గాలి పోచమ్మ బస్తీ పాటు సర్వేనెంబర్‌ 348/1 జగద్గిరిగుట్ట డివి జన్‌ పరిధి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతా ల్లోని ప్రభుత్వ భూములు హారతి కర్పూరంల మింగేస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు పాగా వేసి పేదల నుంచి లక్షల్లో వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు . ఈ తంతు ప్రజా అధికారుల ,ప్రతిని ధుల కనుసన్నలలో జరుగుతుందని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ప్రజా ప్రతినిధులు ,అధికారులు అక్రమార్కుల నుంచి చేతివాటం ప్రదర్శిస్తున్నారని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తు న్నాయి. దీనికి పేదలే సమిధలుగా మారి రోడ్డున పడు తున్నారు . ఇది ఇలా ఉండగా సర్వే నెంబరు 342, 329 ,307, భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసిన కూడా అధికారులు నిమ్మకు నీరె త్తినట్లు వ్యవహరిస్తున్నారు. కబ్జాదారులకు ప్రజా ప్రతినిధులు వత్తాసు పలుకుతుండడంతో వారి భూభాగోతం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఈ భూకబ్జాలలో అధికార పార్టీకి చెందిన నేతలే చక్రం తిప్పడం తో పాటు వారికి అండదం డలు పుష్కలంగా ఉండడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా రాజ్యమేలుతున్నారు. కోట్లకు పడగెత్తుతున్నారు . పలు పత్రికలు రాస్తున్న వరుస కథనాలతో అధికార యంత్రాంగం పక్కా సమా చారంతో మంగళవారం ఉదయం నుంచి కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది .12 జెసిబిల సహాయంతో మూడు మండలాలకు చెందిన రెవెన్యూ సిబ్బంది తోపాటు, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సుమారు 100 మంది పోలీసు అదికారులు ,సిబ్బంది బందోబస్తు మధ్య రెవెన్యూ సిబ్బంది తో కలిసి వందలాది అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు .సర్వే నెంబరు 342 లో సుమారు 500, సర్వే నెంబరు 329లో ఐదు రూములను, సర్వే నెంబర్‌ 307లో గాలి పోచమ్మ బస్తీలో సుమారు 100 ఇండ్లను మేడ్చల్‌ జిల్లా ఆర్డిఓ మల్లయ్య, కుత్బుల్లాపూర్‌ మండల తహసిల్దార్‌ సంజీవరావు, నేతత్వంలో అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. ఒక్కసారిగా కూల్చి వేతలు చేపట్టడంతో బాధితులు ఇదేమి ఖర్మ అంటూ గుండెలు బాదుకుంటూ లబోదిబో మంటూ రోదించారు. భూకబ్జాదారుల చేతిలో పూర్తిగా మోసపోయామని కన్నీటి పర్యంతమయ్యారు .కొంత మంది శాపనార్ధాలు పెట్టారు. కొంతమంది అయితే సోమ్మసిల్లిపోయారు. ఆస్పత్రుల పాలయ్యారు. పిల్లాపాపలతో రోడ్డున పడ్డామని గుండెలు బాదుకున్నారు .అధికారుల తీరుపై మండిపడ్డారు ముందుగా తమకు చెప్పి ఉంటే జాగ్రత్త పడేవారిమని ఆవేదన వ్యక్తం చేశారు. కాయ కష్టం చేసుకుని పైసా పైసా కూడ పెట్టుకుని బంగారం ఇతరత్రా ఆభరణాలను తాకట్టు పెట్టామని.. తక్కువ ధరలో ఇప్పిస్తామన్న అమాయకుల బురిడీ మాటలతో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మధ్యవర్తులు అమాయకులను బురిడి కొట్టించి ప్రభుత్వ ఖాళీ స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు పేద ప్రజలకు భద్రత , భరోసా, ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని అక్రమ నిర్మాణాలకు ఆర్‌ఐతో పాటు వీఆర్‌ఏలు సహకరించారన్న సమాచారంతో వారు ఇటీవల సస్పెండ్‌కు గురయ్యారు.

 

Spread the love