నవతెలంగాణ – హైదరాబాద్: తొలుత ఫిర్యాదు చేసి ఆ తర్వాత నిందితులతో సెటిల్మెంట్ చేసుకుని కేసును విత్ డ్రా చేసుకునే వారిపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి వల్ల అధికారులకు, కోర్టులకు సమయం వృథా అవుతోందని ఓ కేసు విచారణ సందర్భంగా పేర్కొంది. ఇలాంటి వారికి భారీ మూల్యం విధించేలా బలమైన యంత్రాంగాన్ని రూపొందించాలని అభిప్రాయపడింది. ఇకపై తమ దృష్టికి వచ్చే అలాంటి కేసులపై తగిన విధంగా తీర్పునిస్తామని తేల్చిచెప్పింది.