నవతెలంగాణ – అమరావతి: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ‘వాహన సేవలను 15 లక్షల మంది తిలకించారు. గరుడ వాహనం రోజునే 3.3 లక్షల మంది వచ్చారు. 26 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 30 లక్షల లడ్డూలు పంపిణీ చేశాం. లడ్డూ నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో హుండీ ఆదాయం రూ.26 కోట్లు లభించింది’ అని తెలిపారు. ఇవాళ ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి.