ఇంకా కొనసాగుతున్న మృతుల గుర్తింపు

The identification of the dead is still ongoingవాషింగ్టన్‌ : అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి ఘటనకు సోమవారానికి 22 ఏండ్లు పూర్తయ్యాయి. 2001 సెప్టెంబర్‌ 11న హైజాక్‌ చేసిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలతో ట్విన్‌ టవర్స్‌ను అల్‌ఖైదా కూల్చివేసింది. ఆ రోజు ఉదయం 8:46 గంటలకు ఒక విమానం సెంటర్‌లోని నార్త్‌ టవర్‌పైనా, రెండో విమానం 9:03 గంటలకు సౌత్‌ టవర్‌పైనా దాడి చేశాయి. తరువాత మూడో విమానం ఉదయం 9:37 గంటలకు వర్జీనియాలోని పెంటగాన్‌ సమీపంలో ఆర్లింగ్టన్‌ వద్ద కూలిపోయింది. నాల్గో విమానం యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 93 తన గమ్యస్థానం చేరుకోకుండా ప్రయాణికులతో నిరోధించబడింది. ఈ 9/11 దాడుల్లో మూడు వేల మందికిపైగా చనిపోయారు. ఈ దాడికి ఒసామా బిన్‌ లాడెన్‌ ప్రధాన సూత్రధారి అని అమెరికా ప్రకటించింది.

Spread the love