– మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్ పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో నేడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని బుధవారం బీఎస్పీ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హజరవుతున్నారని నియోజకవర్గంలోని బీఎస్పీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పెద్ద సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని ప్రభాకర్ కోరారు.