నవతెలంగాణ – గువాహటి: అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఓ జిల్లా పేరును మార్చింది. కరీంగంజ్ పేరును శ్రీ భూమిగా మారుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిశ్వశర్మ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. ‘‘విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంద ఏండ్ల క్రితం కరీంగంజ్ గడ్డను మా లక్ష్మీగా అభివర్ణించారు. ఆయన గౌరవార్థం నేడు ఈ ప్రాంతానికి శ్రీ భూమిగా పేరు మారుస్తున్నాం. ఇక నుంచి ఈ పేరు అధికారికంగా వాడుకలో ఉంటుంది.