– నిందితులను కఠినంగా శిక్షించాలి
– ఆమ్ ఆద్మీ పార్ీ తెలంగాణ డాక్టర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష నాయుడు
నవతెలంగాణ-హిమాయత్ నగర్
కలకత్తాలోని ఆర్.జీ.కర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలిని కిరాతకంగా హతమార్చిన నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ డాక్టర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ లక్ష నాయుడు సోమవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా వైద్ురాలిని డ్యూటీలో ఉండగానే కిరాతకంగా హతమార్చిన ఘటన మానవ సమాజానికి సిగ్గుచేటు అన్నారు. ఇంతటి ఘోరమైన నేరానికి పాల్పడిన నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సంఘటన ఆగస్టు 9వ తేదీన, ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ, కలకత్తాలోని ఛాతీ వైద్య విభాగం, సెమినార్ రూమ్‌లో జరిగందని గుర్తు చేశారు. పని ప్రదేశాల్లో పటిష్టమైన భద్రత లేకపోవడమే ఇందుకు కారణమా లేక సరైన విద్య లేకపోవడం వల్ల పిల్లల మనస్తత్వం సరికాని అభివద్ధి లేదా సహచరుడు మానవుడి పట్ల సానుభూతి లేకపోవడమా, లేదా విస్తారమైన సామాజిక ప్రతికూల ఆలోచనా ప్రభావమా అని ఆమె ప్రశ్నిం చారు. ఇక్కడ ఎవరిని నిందించాలో అర్థం కానీ ప్రశ్నగా మిగులుతుంద న్నారు. న్యాయం కోసం గొంతులు వినిపిం చాలని, నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలని కోరారు.మహిళా డాక్టర్ పోస్ట్ మార్టం 2-3 మహిళా సర్జన్లు, ఇతర సంబంధిత అధికార బందాల సమక్షంలో అవసరమైన అన్ని పరీక్షలు, విధానాలు, సాక్ష్యాలతో న్యాయ బందం సరైన ప్రోటోకాల్ అనుసరించి కేసు వీలైనంత త్వరగా పరిష్కరించబడాల ని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వ సహకారంతో ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా అన్ని చట్టాలను పూర్తి చేసి మహిళా వైద్యురాలికి న్యాయం చేసి ఆమె కుటుంబా నికి పరిహారం అందించాలని, ప్రాణాలు కాపాడే డాక్టర్లకే భద్రత లేకపోతే మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్థకమని, ఇది మొత్తం మహిళల భద్రతకు సంబంధించినదని, ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుని మహిళాలకు భద్రత కల్పించాలన్నారు.