హైదరాబాద్: నగరంలో తన రెండవ నూతన ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ది ఇండియన్ గ్యారేజ్ కో తెలిపింది. శరత్ సిటీ మాల్‌లో ఈ స్టోర్‌ను ఫిబ్రవరి 15న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో వనస్థలిపురంలో తొలి స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. కొత్త స్టోర్‌ను 3,746 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం ద్వారా నగరంలో తమ బ్రాండ్ ఉనికిని బలోపేతం చేసుకోనున్నట్లు ఆ సంస్థ సిఇఒ అనంత్ టాంటెడ్ పేర్కొన్నారు.