నవతెలంగాణ – హైదరాబాద్: ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూకుడు కొనసాగుతోంది. ఆదివారం క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ నంబర్-2 బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత్ 1 (4)- 1 (2) తేడాతో విజయం సాధించింది. తొలుత మ్యాచ్ 1-1తో టై అయింది. షూటౌట్‌లో భారత్ 4-2తో గెలుపొందింది. తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్ చేయలేదు. రెండో క్వార్టర్ ఆరంభమైన కాసేపటికే భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాకీ కర్రతో బ్రిటన్ ఆటగాడి తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని భావించిన రిఫరీలు రోహిదాస్‌ను రెడ్‌కార్డ్ ద్వారా బయటికి పంపారు. దీంతో తర్వాత భారత్ 10 మందితోనే ఆడింది. 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. 27వ నిమిషంలో మోర్టన్ లీ గోల్ చేయడంతో స్కోర్ సమం అయింది. తర్వాతి రెండు క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.