– నూతన న్యాయ చట్టాల అమలు
నవ తెలంగాణ సిరిసిల్ల
నేరాల నియంత్రణ వేగవంతంగా శిక్షలు పడేలా ప్రభుత్వం సరికొత్త చట్టాలను అమల్లోకి తీసుకువచ్చింది ఇండియన్ పీనల్ కోడ్( ఐపీసీ)-1880 స్థానంలో భారతీయ న్యాయ సంహిత( బి ఎన్ ఎస్)-2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( సి ఆర్ పి సి) స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత( బి ఎన్ ఎస్ ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్( ఐ ఈ ఏ), బదులుగా భారతీయ సాక్ష అదినియం( బి ఎస్ ఏ) అమల్లోకి తెచ్చింది ఈ నెల ఒకటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లో బి.ఎన్.ఎస్ సెక్షన్ల ద్వారా కేసులను నమోదు చేస్తున్నారు బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత అధికారి పరిశీలించి ఏ సెక్షన్ వర్తిస్తుందో తెలుసుకుని కేసులను నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుంది కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్లలో అధికారులు రైటర్లు కేసులు నమోదు చేస్తున్నారు ఐపీసీలో511 సెక్షన్లు ఉండగా బి ఎం ఎస్ లో 358కి కుదించారు కొత్త చట్టంలో పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి
నేరాలు నియంత్రించేందుకు కొత్త చట్టాలు…
సమాజంలో మహిళలు పిల్లలపై జరుగు నేరాలను నియంత్రించేందుకు కొత్త చట్టంలో అనేక చర్యలు చేపట్టారు గతంలో ఉన్న వాటికంటే శిక్షణ కాలపరిమితిని పెంచారు బాధిత మహిళలు పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా కొత్త చట్టంలో అంశాలను పొందుపరిచారు రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి. బాధిత మహిళలు పిల్లలకు ఉచిత ప్రాథమిక వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీనిస్తున్నాయి అత్యాచారం నేరాల కేసుల్లో బాధితురాలు వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చు…
బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఘటనకు సంబంధించిన అంశాలను ఫిర్యాదు చేయవచ్చు దీంతో కేసు విచారణ వేగవంతంగా చేసేందుకు పోలీసులకు వెసులుబాటు ఉంటుంది జీరో ఎఫ్ ఐ ఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధం లేకుండా ఎక్కడి పోలీస్ స్టేషన్లోనైనా పిహెచ్ చేయవచ్చు కేసు నమోదు అయిన తరువాత బాధితుడితో పాటుగా పాటుగా నిందితుడు కూడా ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా పొందే అవకాశం ఉంది.
దర్యాప్తు వేగవంతం చేసేందుకు…..
గతంలో కేసులు దర్యాప్తు మందకోడిగా జరిగేది కొత్త నేర న్యాయ చట్టాల ద్వారా దర్యాప్తు వేగవంతం చేసేందుకు వెసులుబాటు ఉంది జీరో ఎఫ్ ఐ ఆర్ ఆన్లైన్ ఫిర్యాదు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమానంగా తీవ్రమైన నేరాల సంబంధించిన వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు వేగం గా జరుగుతుంది తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా వెళ్లాలి అక్కడ లభించిన ఆధారాలు సేకరిస్తారు ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరిగా చేస్తారు దీంతో దర్యాప్తు బాధ్యత విశ్వసనీయత పెరుగుతుంది నిందితులకు శిక్షలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పేర్లు మార్చారు అంతే…
– తంగళ్ళపల్లి వెంకట్ ,న్యాయవాది, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల
చట్టాల్లో పెద్ద మార్పు ఏం కనిపించడం లేదు ఇంగ్లీష్ పదాలను తొలగించి సాంస్కృత పదాలను అమర్చినట్లు ఉంది నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకునే గడువు పెంచారు ప్రస్తుతం అరెస్ట్ అయిన తర్వాత 14 రోజుల్లోపే కస్టడికి కోరే అవకాశం ఉంది ఈ గడువును 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన కేసుల్లో 40 రోజులకు 90 రోజుల్లో దర్యాప్తు చేయాల్సిన కేసుల్లో 60 రోజుల వరకు పొడిగించారు.
విచారణ వేగవంతం అవుతుంది: కస్పరాజు కృష్ణ సిఐ సిరిసిల్ల
నూతన నేర న్యాయ చట్టాలు-2023 ద్వారా కేసుల విచారణ వేగం అంతం అవుతుంది కేసుల విచారణలో మార్పులు వస్తాయి ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది శాంతి భద్రతల పరిరక్షణలో ఇది ఒక మైలు రాయి నేరం చేసిన వారికి శిక్షలు పడేందుకు ఎక్కువ అవకాశం ఉంది దీంతో సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుంది ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉంటుంది.