నవతెలంగాణ – హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు(సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1) ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు. బుధవారం జరిగిన పరీక్షకు 5,07,754 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 4,88,113 మంది హాజరయ్యారు. 19,641 మంది విద్యార్థులు హాజరు కాలేదు. కరీంనగర్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో మాల్ ప్రాక్టీస్ కేసులు ఒక్కొక్కటి చొప్పున నమోదు అయ్యాయి. ఇక ఇంటర్ బోర్డు నుంచి నల్లగొండ, మెదక్, జనగామ, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాలకు అధికారులు వెళ్లి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు.