ఉద్దేశపూర్వకంగా తనపై విచారణ అధికారులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

– తాను నిధులు దుర్వినియోగం చేయలేదు
– ఎంఓ  ముత్తినేని సుధీర్ బాబుకు 6వ తేదీన నగదు రూ.4.60 లక్షలు అప్పగించా
– ఏ  ప్రమాణానికైనా సిద్ధం
– ఉన్నతాధికారులు స్పందించి ఎం ఓ పై  చర్యలు తీసుకోవాలి
– 6వ తేదీన విచారణకు వచ్చి నగదు తీసుకొని తనకు నగదు ఇవ్వలేదంటూ తిరిగి సోమవారం విచారణకు
– తనను మోసం చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలని కోరిన బిపిఎం
– చిన్న స్థాయి ఉద్యోగిపై కక్ష సాధింపు చర్యలు భావ్యం కాదు
– చివ్వెంల బిపిఎం జల్ల సాయికృష్ణ
నవతెలంగాణ – చివ్వెంల
పోస్ట్ ఆఫీస్ నిధులను దుర్వినియోగం చేసినట్లు నాపై విచారణ కు వచ్చిన అధికారులు ఐపీఓ సైదిరెడ్డి, ఎంఓ ముత్తినేని సుదీర్ బాబులు ఉద్దేశపూర్వకంగా తనపై  కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని చివ్వెంల గ్రామ బీపీఎం జల్ల సాయికృష్ణ తెలిపారు. మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలోని బిపిఎం కార్యాలయం ముందు నిరసన తెలిపి అతను మాట్లాడాడు…  పెన్ పహాడ్ మండల పరిదిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన తాను చివ్వెంల గ్రామoలో గత కొంతకాలంగా బీపీఎంగా పనిచేస్తున్నానని తెలిపారు. ప్రతి నెల మాదిరిగానే గ్రామంలో 732 మంది లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు చెల్లించేందుకు గత నెల 22వ తేదీన సూర్యాపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి రూ.12లక్షలు మొదటిసారిగా తీసుకొచ్చానని అనంతరం గత నెల 28వ తేదీన మరోసారి రూ.4లక్షలు తీసుకువచ్చానని తెలిపాడు. గ్రామంలో లబ్ధిదారులకు రూ.14 లక్షలు పంపిణీ చేయగా మిగిలిన వాటితో పాటు సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్ డిపాజిట్లు,  ఆర్డీలకు సంబంధించిన మొత్తం రూ.4.80 లక్షలు తిరిగి సూర్యాపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఈ నెల 5వ తేదీన జమ చేయాల్సి ఉండగా,  ఆరోజు లబ్దిదారులకు నగదు ఇచ్చే వరకు కార్యాలయ సమయం ముగియడంతో,  మరుసటి రోజు ఈనెల 6 శనివారం రోజున మధ్యాహ్నం భోజన విరామం తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీసు లో నగదు వేయడానికి తాను సిద్ధమవుతుండగా,  అదే సమయంలో ఎంఓ ముత్తినేని సుదీర్ చివ్వెంల పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి రావడం జరిగిందని తెలిపారు. రికార్డులను పరిశీలించిన అనంతరం తన దగ్గర నిల్వ ఉన్న రూ. 4.80 లక్షలలో  రూ.4.60 లక్షలు రికవరీ తీసుకొని మిగతా రూ.20 వేలను తన వద్ద ఉంచి, సుధీర్  రికవరీ చేసుకొన్న రూ.4.60లక్షలు ఆ నగదును ఐ ఈ  సూర్యాపేట లో చెల్లిస్తానని చెప్పి ఆ నగదును తీసుకొని వెళ్ళాడని తెలిపాడు. 5వ తేదీన చెల్లించాల్సిన నగదును 6వ తేదీ వరకు ఎందుకు చెల్లించలేదని మరోసారి ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని తనని హెచ్చరించి సుదీర్ అక్కడి నుండి వెళ్ళాడని తెలిపాడు. సుదీర్ తీసుకెళ్లిన రూ.4.60 లక్షలు సూర్యాపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ లో  జమ చేయకుండా తన వద్దే ఉంచుకొని, మరల తిరిగి సోమవారం మరో అధికార బృందం ఐపీఓ సైదిరెడ్డి, మెయిల్ ఓవర్సీస్ (ఎంఓ) ముత్తినేని సుదీర్ కలిసి పోస్ట్ ఆఫీస్ కి వచ్చినట్లు తెలిసిందని, అదే రోజు నేను నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పోస్ట్ ఆఫీస్ కు రాలేనని ఈ అధికారులకు తెలిపి రాలేదని తెలిపాడు. అయినా ఉద్దేశపూర్వకంగా తాను లేని సమయంలో చివ్వెంల బిపిఎం కార్యాలయానికి వచ్చి తనిఖీ చేశారని ఆరోపించారు…ముత్తినేని సుధీర్ తీసుకున్న రూ.4.60 లక్షలు శనివారం తీసుకెళ్లి ఐ ఈ  సూర్యాపేట కార్యాలయంలో జమ చేయకుండా , అతని సొంతం కు వాడుకుని చిన్న ఉద్యోగిని అయిన తనపై డబ్బులు దుర్వినియోగం చేశాడని తప్పుడు సమాచారాన్ని మీడియా వారికి తెలిపి తనపై తప్పుడు కథనాలు రాయించారని తెలిపాడు…. శనివారం మెయిల్ ఓవర్సీస్ సుధీర్ బీపీఎం కార్యాలయానికి వచ్చి తన దగ్గర తీసుకెళ్లిన రూ.4.60 లక్షలకుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని. తనపై తప్పుడు ఆరోపణ చేస్తూ తనని మానసికంగా ముత్తినేని సుదీర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని దీనిపై పోస్ట్ ఆఫీస్ ఉన్నతాధికారులు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ముత్తినేని సుధీర్ రావు పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని తెలిపాడు.
అసలు జరిగిందేంటి..
గత నెల 22, 28వ తేదీలలో బిపిఎం జల్ల సాయి కృష్ణ తెచ్చిన రూ.16లక్షలు రూపాయలలో రూ.14 లక్షలు 723 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా దాంట్లో మిగిలిన నగదు తో పాటు సుకన్య యోజన, ఫిక్స్ డిపాజిట్లు తదితర విషయాల ద్వారా వచ్చిన నగదు మొత్తం బిపిఎం దగ్గర రూపాయలు రూ.4.80 లక్షలు నిలువ ఉంది… బిపిఎం ఈనెల 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సూర్యాపేటలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ లో నగదు జమ చేయాల్సి ఉండగా లబ్ధిదారుల పంపిణీలో ఆలస్యమై జమ చేయలేదని బీపియం తెలుపుతున్నాడు. ఆలస్యం అయితే వెంటనే ఫోన్ ద్వారా గాని తనిఖీల ద్వారా గాని పోస్ట్ ఆఫీస్ అధికారులు మరుసటి రోజు నగదు జమ చేసేలా చర్యలు తీసుకోవాలి,  చివ్వెంల బిపిఎం సాయి కృష్ణ మిగిలిన నగదు ఆలస్యం చేయడంతో వెంటనే మరోసారి రోజు ఈ నెల 6వ తేదీ  శనివారం నాడు మధ్యాహ్న సమయంలో శాఖ రూల్స్ ప్రకారం విచారణకు వచ్చిన ఎంఓ ముత్తినేని సుధీర్ రికార్డులను పరిశీలించి,  ఆ నగదును స్వాధీనం చేసుకొని అదే రోజు సూర్యాపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ లో జమ చేస్తానని చెప్పి వెళ్లాడని బీపీఎం ఆరోపిస్తున్నాడు. ఇదే విషయంలో సుదీర్ మాత్రం తనకు నగదు అప్పజెప్పలేదని ఇంటి దగ్గర ఉన్నాయని, అదే రోజు నాలుగు గంటల వరకు జమ చేస్తానని తనకు చెప్పాడని ఆరోపిస్తున్నాడు… ఒకవేళ బిపిఎం సాయికృష్ణ నగదు అప్పజెప్పకుండా మాయమాటలు చెప్పే పరిస్థితి ఉన్నట్లయితే, అతని నుండి  స్వతహాగా ఏదైనా పత్రం గాని అతనిపై యాక్షన్ తీసుకున్నట్లు ఏదైనా రసీదు గానీ ఇవ్వాల్సి ఉండగా అలాంటివి ఏమీ ఇవ్వకుండా సుధీర్ వెళ్ళాడు. అంటే నగదు తీసుకొని వెళ్ళాడు కాబట్టే తనకు ఎలాంటిది ఇవ్వకుండా వెళ్ళాడని బిపిఎం ఆరోపిస్తున్నారు. నగదు సాయంత్రం సమయం వరకు కూడా బీపీఎం నగదు జమ చేయనపుడు 6వ తేదీ నాడు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆరోజు ఎం మాట్లాడకుండా, అతను లేని సమయంలో మరుసటి రోజు విచారణకు వచ్చి అక్కడే ఉండి హడావుడిగా పత్రికలకు సమాచారం ఇవ్వాల్సిన అవసరమేంటని పలువురు ఆరోపిస్తున్నారు… నగదు రికవరీ చేసుకున్నారు కాబట్టి ఆతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కావాలనే పోస్ట్ ఆఫీస్ అధికారి సైదిరెడ్డి, సుధీర్ లు  రూ. 4.60 లక్షలు కాజేసి తాను లేని సమయంలో చివ్వెంలో బిపిఎం కార్యాలనుకొచ్చి తనపై తప్పుడు కథనాలు ఉద్దేశపూర్వక ఆరోపణ చేస్తూ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారని బిపిఎం ఆరోపిస్తున్నారు. ఓ చిన్న స్థాయి ఉద్యోగిని అయిన తనపై రూ 4.6 లక్షలు స్వాహా చేశాడని ఆరోపణలు చేయడంతో భావ్యం కాదని బీపీఎం ఆరోపిస్తున్నాడు. రూ.4.60లక్షలు కాజేసి కాపాడాల్సిన ఉన్నతాధికారే అహంకారంతో తనని ఇబ్బంది గురి చేయడం భావ్యం కాదని,  వెంటనే తీసుకున్న నగదు చెల్లించి తనపై  చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకోవాలని బిపీఎం సాయి కృష్ణ కోరుతున్నారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేసి అసలు నగదు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకొని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Spread the love