నవతెలంగాణ- హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వరుసగా జిల్లాల పర్యటనలో దూసుకుపోతున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 2న నల్లగొండ ఐటీ టవర్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇక నిన్న సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంటకల కరెంట్ గ్యారెంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి దిగడం ఖాయం, ఆకాశం నుంచి పాతాళం వరకు అన్ని కుంభకోణాలే. ఆ కుంభకోణాల కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకోవడం ఖాయం అని కేటీఆర్ అన్నారు.