సిద్దిపేట జిల్లాలోని చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చేర్యాల పట్టణంలో పలువురు జేఏసీ నాయకులు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీఎం స్వంత జిల్లాలో ఉన్న చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే,మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రాలను ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎలాంటి ఉద్యమాలు చేయని ప్రాంతాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో గత 29రోజులుగా నిరాహార దీక్షలు,ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కొనసాగుతుంది.