నవతెలంగాణ – హైదరాబాద్ : బ్రిటన్ రాజు చార్లెస్ – 3 (75) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారని తెలిసింది. అంతకుముందు కింగ్ చార్లెస్ ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆ సందర్భంగా చార్లెస్ భార్య క్వీన్ కెమిల్లా కంట నీరు పెట్టుకున్నారు. వైద్యబృందం నుంచి సలహా తీసుకున్న తర్వాతనే చార్లెస్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన తన ప్రసంగం నిడివిని 45 నిమిషాలకు తగ్గించుకున్నారు. అయితే బ్రిటన్ కింగ్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో భాదపడుతున్నారని సమాచారం.