సాధారణంగా నేను సంవత్సరాది నెల సెలవులపై హైదరాబాద్ వచ్చి తిరుగు ప్రయాణం సౌది అరేబియాలోని జెద్దా నగరం. కాని ఈ సారి మనుమరాలు, మనువడి కోరికపై హైదరబాద్ నుంచి సౌది రాజధాని అయిన రియాద్ కు వెళ్లాను. పెద్దబ్బాయి ఒలయా ఏరియా లోని ఓ కంపౌండ్ లో ఉంటున్నాడు. అక్కడే దగ్గర్లోనే ఉంది ‘కింగ్ డమ్ టవర్.’ దీని గురించి చాలా విన్నాను. నా బెడ్ రూం అద్దాల కిటికి లోంచి స్పష్టంగా కనిపిస్తోంది. గాజు కిటికీ తెర పక్కకు జరిపి గంటల తరబడి దాన్నే చూస్తుంటాను, మంచంలో వెల్లకిలా పడుకొని. సాయంత్రం సూర్యాస్థమయం తర్వాత కింగ్ డమ్ టవర్ చూడడానికి వెళ్లితే రియాద్ సిటీ చాలా అందంగా కనిపిస్తోంది అని మా పెద్దబ్బాయి చెప్పాడు. వీక్ ఎండ్స్ లో చాలా రద్దిగా ఉంటుంది. కాబట్టి మేము మంగళవారం సంధ్యా సమయంలో వెళ్లాలని నిర్ణయించాం. దాని వల్ల పగలు మరియు రాత్రి పూట రియాద్ నగరాన్ని చూసి ఆనందించగలమని. అలాగే చేశాం. సూర్యాస్తమయం చూస్తూ నేను పిల్లలు చాలా ఆనందించాం. చీకటి పడుతూండగానే విద్యుత్తు దీపాలు కండ్లకు మిరుమిట్లుగొన్నాయి. మేము రియాద్ పట్టణం యొక్క అద్భుతమైన వీక్షణను ఆస్వాదించాం. ఇది నగరం యొక్క పరిమాణాన్ని గురించి గొప్ప దృక్పథాన్ని అందించింది. అంతేగాకుండా స్కై బ్రిడ్జ్ నుండి రియాద్ వీధులు, భవనాలపై ప్రతిబింబించే విద్యుత్తు కాంతులు మనసుకు ఆహ్లాదపరిచాయి. సెల్ఫీలు తీసుకోవడం వల్ల మన వెనుక వున్న నగరం అందాలు కనిపించేందుకు ఇదో మంచి మార్గం.
కింగ్ డమ్ టవర్ ను కింగ్ డమ్ సెంటర్ అని కూడా పిలుస్తారు. ఇది 99 అంతస్థులు గల ఎత్తైన బిల్డింగ్. దీని ఎత్తు 302 మీటర్లు. గ్రౌండ్ ఫ్లూర్ నుంచి పై కెళ్లితే 13 అంతస్థుల్లో ఆఫీసులు, 10 అంతస్థుల్లో హోటళ్లు, 5 అంతస్థుల్లో విలాసమైన అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. కింగ్ డమ్ హోల్డింగ్ కంపెనీ వారు ఈ టవర్ ను కట్టారు. యజమాని ప్రిన్స్ (తలాల్) అల్ వలీద్. డిజైన్ ఎల్లర్బి బెకెట్ (జుశ్రీశ్రీవతీbవ దీవషసవ్). ఇంజనీరింగ్ ఒమ్రానియ (ఉఎతీaఅఱa). ఈ టవర్ నేలపై లక్ష మీటర్లలో వ్యాపించి ఉంది. దీని మరో ప్రత్యేక ఆకర్షణ 65 మీటర్ల స్కై బ్రిడ్జి ఆకాశ హర్మ్యంలో నిర్మించబడింది. దీనిలో 300 టన్నుల స్టీల్ ఉపయోగించబడింది. టవర్ యొక్క ఎగువ మూడవ భాగంలో, స్కైబ్రిడ్జ్ పై ఒక విలోమ పారాబొలిక్ ఆర్చ్ నిర్మాణం ఉంది. ఇది రెండు వైపులా కిటికీలతో ఒక పరివేష్టిత (వఅషశ్రీశీరవస) కారిడార్ రూపాన్ని తీసుకుంది. అత్యంత సురక్షితమైన గాజు పలకల ద్వారా నిర్మితమై ఉంది. ఈ కట్టడం నగరం అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం. ఈ గ్లాస్ ప్యానెల్‌లు నక్షత్రాల రాత్రులలో పలు రకాల రంగుల వీక్షణను ఆస్వాదించడానికి ముదావహంగ ఉంటుంది.
కింగ్డమ్ టవర్/ కింగ్డమ్ సెంటర్ నిర్మాణం 1999 లో మొదలై 2002 లో పూర్తైంది. కింగ్ ఫహద్ రోడ్ పై వెలసిన ఈ టవర్ ఖర్చు 177 లక్షలు సౌది రియాల్ (4,530 లక్షలు యూయస్ డాలర్లు). స్కై బ్రిడ్జికి చేరుకోవడానికి పర్యాటకులు, సందర్శకులు 99వ అంతస్తుకు ఎలివేటర్ ద్వారా వెళ్లవచ్చు. ఇక్కడ స్కై బ్రిడ్జ్ మరియు టిక్కెట్ కౌంటర్ ”మాంట్ బ్లాంక్” మరియు ”కరోలినా హెర్రెరా” దుకాణాల మధ్య ఉన్నాయి. టిక్కెట్ల ధరలు పెద్దవాళ్లకు 69 సౌది రియాల్ 10 సంవత్సరాల లోపు పిల్లలకు 23 సౌది రియాల్.
కింగ్డమ్ టవర్/కింగ్డమ్ సెంటర్ వింత గొలిపే అద్భుత ఆర్చిటెక్చర్ నిర్మాణం. చూడదగిన పర్యాటక కేంద్రం.
– మొహ్మద్ అమ్జద్ అలీ,
00 966 507662638