కొండచరియలు విరిగి పడిన ఘటన.. 2,000కు చేరిన మృతుల సంఖ్య

నవతెలంగాణ – హైదరాబాద్: పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరిగి వేలకు చేరింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐరాసకు వెల్లడించింది. ‘‘కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2,000 మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు’’ అని ఆ దేశంలోని నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌నుంచి ఐరాస ఆఫీస్‌కు సమాచారం వెళ్లింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖను ఆ కార్యాలయానికి పంపింది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలు పడినట్లు తెలుస్తోంది.

Spread the love