తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌
నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
నైజాం రజాకార్లను తరిమి కొట్టిన ఘనత, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టుల దేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆలేరు పట్టణంలోని ఏసి రెడ్డి భవనం ముందున్న అమరవీరుల స్తూపం వద్ద, మండలంలోని కొలనుపాక గ్రామంలో అమరవీరుల స్థూపాల వద్ద , ఆదివారం రాత్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏసి రెడ్డి నరసింహారెడ్డి , అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ పోరటాలలో అజరామరంగా నిస్తుందని ,సాయుధ పోరాటం ద్వారా నిజాం రాజ్యాన్ని నేలమట్టం చేయడమే కాకుండా, ఆరున్నర లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందన్నారు. నిజాం నవాబు పేరు చెప్పుకొని పేద ప్రజలపై అరాచకాలు చేస్తున్న ఇసునూరి రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి, ప్రతాపరెడ్డి, కిషన్‌ రావు, రాపాక రామచంద్రారెడ్డి లాంటి భూస్వామ్య పెత్తందారులను అంతమొందించి, వెట్టిచాకిరిని నిర్మూలించిన ఘనత తెలంగాణ సాయుధ పోరాటానికి దక్కుతుందన్నారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆరుట్ల. కమలాదేవి, ఆరుట్ల. రామచంద్రారెడ్డి, రావి. నారాయణరెడ్డి, షేక్‌. బందగి, షోయబుల్లా ఖాన్‌, భీమ్‌ రెడ్డి, నరసింహారెడ్డి ,మల్లు. స్వరాజ్యం, బద్దం. ఎల్లారెడ్డి, ఏసి రెడ్డి .నర్సింహారెడ్డి, దుంపల. మల్లారెడ్డి, కాచం. కష్ణమూర్తి, నరసింహులు, లాంటి ఎందరో కమ్యూనిస్టు పోరాట యోధులు న్యాయకత్వం వహించిన సాయుధ పోరాటం చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రమేయం లేని ,ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘాల పోరాటం సాగుతున్నప్పుడు, కనీసం మద్దతు తెలిపినట్టు అన వాళ్ళు లేవన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని రెండు మతాల మధ్య పోరాటంగా చూయించే సిగ్గుమాలిన పని మానుకోవాలని అన్నారు.అనంతరం కొలనుపాక గ్రామం వరకు ప్రదర్శనగా వెళ్లి గ్రామంలోని ఆరుట్ల కమలాదేవి, రామచంద్ర రెడ్డి విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు. నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మాటూరి. బాలరాజు, కల్లూరి. మల్లేశం, దాసరి.పాండు,జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ. ఇక్బాల్‌, మండల కార్యదర్శి దూపటి. వెంకటేష్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం.వెంకటేష్‌ ,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వనం. రాజు, పిఎన్‌ఎం నాయకులు ముత్యాలు, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌, మొరిగాడి.చంద్రశేఖర్‌, మోరిగాడి. రమేష్‌, నల్లమాస. తులసయ్య, ఘనగాని. మల్లేశం, సంగి.రాజు , వడ్డేమాన్‌. బాలరాజు, మిట్ట, శంకరయ్య, భజన రాజు, డివైఎఫ్‌ఐ నాయకులు చేన్న .రాజేష్‌, భువనగిరి. గణేష్‌ ,వడ్డేమాన్‌ .విప్లవ్‌ ,మాదాని. నవీన్‌ , ఎండి. మతిన్‌ , మొరిగాడి. లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love