ఎమ్మార్పీ రేట్ కంటే అధిక ధరలకు అమ్ముతే లైసెన్స్ రద్దు చేస్తాం..

నవతెలంగాణ-  మద్నూర్
మద్నూర్ డోంగ్లి, మండలాల్లో గల ఎరువులు మరియు విత్తన దుకాణాలను బుధవారం నాడు టాస్క్ ఫోర్స్ టీమ్ బాన్సువాడ ఏఓ సుధాకర్, మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీల్లో.  ముఖ్యంగా ఎరువు డీలర్లు డీఏపి మరియు ఇతర ఎరువులను ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు అమ్మినట్లైతే వారి యొక్క లైెసేన్సులను రద్దు చేయడం తో పాటు కఠీన చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు.  విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసే రైతులకు రసీదు తప్పకుండా ఇవ్వాలి, సూచించారు. తనిఖీలో భాగంగా పలు దుకాణాలకు నోటీస్ లు ఇవ్వడం జరిగింది. ఎరువులు ఎక్కడి నుంచి తెచ్చారు , ఏ ఏ కంపెనీది అనేది డాక్యుమెంట్ ఉండాలన్నారు ఆదేశాలు జారీ చేశారు.  ఎప్పటికప్పుడు ఏ ఎరువులు ,ఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయో వ్యవసాయ అధికారికి తెలియజేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుందని బాన్సువాడ ఏఒ సుధాకర్, మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు దుకాణదారులకు తెలియజేశారు.  ప్రతి డీలర్లు లైసెన్స్ కాపీ, స్టాక్ బోర్డ్, బిల్ బుక్ తప్పకుండా ఉండాలని తెలియజేశారు.

Spread the love