– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
– ఐడిఎస్ ద్వారా పలిమెల ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రతిపాదనలు రూపొందించాలి
– పలిమెల మండలంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ప్రజా ప్రతినిదులతో కలిసి పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి
నవతెలంగాణ – మల్హర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
పలిమెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరించి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే దిశగా అవసరమైన పనుల ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం రాత్రి పలిమెల మండల కేంద్రంలో పల్లెనిద్ర నిర్వహించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంగళవారం ఉదయం వివిధ గ్రామాల ప్రజల నుంచి వారి సమస్యల పై దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం పలిమెల ఎత్తిపోతల పథకం పై మంత్రి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో రూ.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 900 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించే దిశగా ఐడిసి ద్వారా పలిమెల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ట్రయల్ రన్ పూర్తి చేశామని, తర్వాత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని, రైతులకు ఆశించిన ఫలితం లభించలేదని మంత్రి తెలిపారు.ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వంలో పలిమెల రైతులకు సాగునీరు అందించే దిశగా ఐడిసి ద్వారా పలిమెల ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని, దీనికి అవసరమైన ప్రతిపాదనలను తయారు చేయాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు.అంబట్టిపల్లి కింది వరకు సాగునీరు అందించే విధంగా మరో నీటి సోర్స్ కోసం ప్రయత్నించాలని, చిన్న సన్న కారు రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించి, ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని, ప్రాధాన్యత క్రమంలో ఆ పనులకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన రైతులకు ఫలాలు అందే విధంగా కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నేటిపారుదల శాఖ ఈఈ తిరుపతి రావు , జడ్పిటిసిలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.