కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల బతుకుల్లో వెలుగులు ఎప్పుడూ..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో  కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల బతుకుల్లో వెలుగులు నింపేదేప్పుడని,ఉన్నత చదువులు చదువుకొని యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని మమ్ములను రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.సోమవారం యూనివర్సిటీ లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన  కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు, జాక్ కో కన్వీనర్ వి దత్తాహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీకి చెందిన కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ చేసే విధంగా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు  డాక్టర్ శరత్, డాక్టర్ గోపి రాజ్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ గంగా కిషన్, స్వామి రావు, జోష్ణ, రాజేశ్వర్, అపర్ణ, గంగాధర్, నాగేశ్వరరావు, రాములు,  గంగాధర్, దేవరాజ్ శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
Spread the love