ట్రాక్టర్ ను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట – ఖమ్మం రాష్ట్రీయ రహదారిలో నారం వారి గూడెం సమీపంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, ముగ్గురికి విషమంగా ఉండటంతో వేరే ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం మేరకు మండలంలో గుమ్మడి వల్లి చెందిన 16 మంది కూలీలు ఆంధ్రా, ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం   రాచన్నగూడెం నుండి మామిడి మొక్కలు లోడు చేసుకుని అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం లోని ఓ ప్రైవేట్ నర్సరీకి తరలిస్తున్నారు. ఈ మొక్కలు లోడు,కూలీలతో నారంవారిగూడెం వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి వచ్చిన ట్రాలీ లారీ అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీ కొట్టి ఈడ్చుకు వెళ్లిపోవడంతో ట్రాక్టర్ బోల్తా పడి కూలీ లందరూ చెల్లాచెదురు అయ్యారు. ఈ ప్రమాదంలో గుమ్మడవల్లి కి చెందిన వెంకటలక్ష్మి(45) అక్కడికక్కడే మృతి చెందగా బత్తుల దుర్గయ్య (60) అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్ర గాయాలు అయిన స్వాతి, అనిల్, ముసలియ్య, నీరజ, దుర్గమ్మ లను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి స్థానికంగా చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.

Oplus_131072
Oplus_131072
Spread the love