నవతెలంగాణ – యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది చాకచక్యంగా మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.