– తక్కడపల్లి గ్రామ శివారులో చోటు చేసుకున్న సంఘటన
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలం తక్కడపల్లి గ్రామ శివారులో తెల్లవారుజామున 5:30 గంటలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుండి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాకు వెళుతున్నMH26BE2386 గల లారీ అదుపుతప్పి బోల్తా పడింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లారీ డ్రైవర్ సతీష్ లారీలో ఇరుకపోవడంతో దాదాపు గంటన్నర పాటు జాతీయ రహదారి ప్రమాదాల నిషేధిత అధికారి ప్రతాప్ సింగ్ వారి బృందం మరియు స్థానిక ట్రాక్టర్ల సహాయంతో గంటన్నర పాటు కష్టపడి డ్రైవర్ని సతీష్ ను బయటకు తీయడం జరిగిందని డ్రైవర్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎస్సై రాములు తెలిపారు లారీలో డ్రైవర్ తో పాటు క్లీనర్ విశ్వనాథ్,రోహిత్,ఉన్నారని వారికి ఎటువంటి గాయాలు జరగలేదని నిద్ర మబ్బులో ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ రాములు తెలిపారు.