బస్సును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్‌ మృతి

నవతెలంగాణ – అమరావతి : కావేరి ట్రావెల్‌ బస్సును లారీ ఢీకొట్టడంతో లారీ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన శుక్రవారం కలపర్రు నేషనల్‌ హైవే వద్ద జరిగింది. హైదరాబాదు నుండి కాకినాడకు వెళుతున్న కావేరీ ట్రావెల్స్‌ బస్సు, లారీని ఢీకొటింది. బస్సు డ్రైవర్‌ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, బస్సు డ్రైవర్‌ ను క్యాబిన్‌ నుండి బయటకు తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మఅతి చెందాడు. మరో 20మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love