కారును ఢ కొట్టిన లారీ..

– ముగ్గురు మృతి
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజీ పిన పాక వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘట నలో ముగ్గురు దుర్మర ణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం నుంచి కల్లూరు మండలం వాత్యా నాయక్‌ తండాకు వెళుతున్న కారును తల్లాడ వైపు నుంచి వైరా వస్తున్న లారీ స్టేజీ పినపాక వద్ద ఢ కొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ దుర్ఘటనలో ఏడాదిన్నర పాప బానోత్‌ శ్రీ వల్లి, బానోత్‌ అంజలి, కారు డ్రైవర్‌ అజ్మీరా రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేగాక కారులో ప్రయాణిస్తున్న వాత్య నాయక్‌ తండా సర్పం చ్‌ బానోత్‌ బాబు, బానోత్‌ రవి, బానోత్‌ ప్రవీణ్‌, బానోత్‌ స్వాతి, బానోత్‌ కార్తికేయలకు గాయా లయ్యాయి. వారిని ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, కారును లారీ ఢ కొన్న తర్వాత కొంత దూరం ఈడ్చు కెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Spread the love