అదుపు తప్పి డివైడర్ ఎక్కిన లారీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ రోడ్డు వైపు నటరాజ్ చౌరస్త సమీపంలో శనివారం తెల్లవారు జామున లారీ అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కింది. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న లారీలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి వాటర్ బాటిల్ మూత తీసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని డివైడర్ నుంచి కిందకు దించారు. జగిత్యాల, కరీంనగర్ ప్రధాన రహదారిపై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద శనివారం వరి లోడుతో వెళ్తున్న లారీ నుంచి వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నం మండలం గోదురు నుంచి పూడూరు రైస్‌మిల్‌కు ధాన్యం లోడ్‌తో ఉన్న లారీలో ధాన్యం బస్తాలు ప్రధాన రహదారిపై పడడంతో సుమారు రెండు గంటల నుంచి రోడ్డుపై లారీ నిలిచిపోయింది. ట్రాఫిక్ ఎస్‌ఐ రామ్ సంఘటన స్థలానికి చేరుకుని రెండు గంటల సేపు అంతరాయం చేసినందుకు డ్రైవర్‌ను మందలించారు. హమాలీలను పిలిపించి వడ్లను లారీలో ఎక్కించి లారీని రోడ్డు పక్కన పెట్టించారు.

Spread the love