ప్రజలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యం : ములుగు డీఎస్పీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రజలకు అందుబాటులో ఉండి రక్షణ కల్పించ డమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ములుగు డీఎస్పీ ఎన్‌ రవీందర్‌ అన్నారు. బుధవారం మండలంలోని పస్రా పోలిస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. అధికారులతో కలిసి స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ ఫంక్షనల్‌ వర్టికల్స్‌ పనితీరు మెరుగుపర్చడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ఎటువంటి క్లిష్టమైన నేరాలు అయినా నూతన టెక్నాలజీని ఉప యోగించి కేసులను చేధించడంలో పోలీసులు ముందుండాలని అన్నారు. పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవరిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలన్నారు. పాత నెరగాళ్లపై నిఘా ఉం చాలని, 100 డయల్‌ ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇచ్చి మెరుగైన సేవలు అందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చెప్పటాలని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌,ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసే వారి పట్ల కఠినంగా వ్యవరించాలని అన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిం చాలని అన్నారు. రోడ్డు భద్రత, ఉమెన్‌ సేఫ్టీ, సైబర్‌ క్రైమ్స్‌ పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. మావోయిస్టు ల కార్య కలపాలపై ఎల్లపుడు నిఘా ఉంచాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు అనేక అపోహలు సృష్టించి వారి సాధారణ జీవనానికి విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. పోలీస్‌లు ప్రజలతో మమేకమై వారి నుంచి సమాచారం సేకరి స్తూ మావోయిస్టు భావజాలం దరిచేరకుండా చైతన్యపర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love