పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

నవతెలంగాణ – ములుగు : మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు నూప బీమా అలియాస్ సంజు , మచ్చకి దుల్దో అలియాస్ సోనీ ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ సిద్దాంతాలు నచ్చకపోవడం, పార్టీపై ప్రజల్లో ఆదరణ సన్నగిల్లడం, ఆనారోగ్య సమస్యలతో కీలక నాయకులు లొంగిపోతున్నారని అన్నారు. లొంగిపోయిన బీమా, సోనీ దంపతులకు ప్రభుత్వం నుంచి రివార్డులు, పునరావాసం అందిస్తామన్నారు. మావోయిస్టు పార్టీలోని వారు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పునరావసం కల్పిస్తామని సూచించారు.

Spread the love