మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మేయర్

నవతెలంగాణ-కంటేశ్వర్
మున్సిపల్ అధికారులతో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మంగళవారం సమీక్ష సమావేశం నగరంలోని మున్సిపల్ నగర మేయర్ ఛాంబర్ లో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ చాంబర్ లో ఇంజనీరింగ్, రెవెన్యూ, పారిశుధ్య, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేయర్ గారు నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి, వర్షాకాల దృష్ట్యా చేపట్టే నాలాల పూడిక తీసే పనుల పురోగతిని వేగవంతం చేయాలని వర్షాల వల్ల ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పారిశుధ్య సిబ్బందితో మాట్లాడుతూ వర్షాల కాలం దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున డ్రైనేజీ డ్రైనేజీలను విధిగా శుభ్రం చేసి దోమలు నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ మున్సిపాలిటీకి రావాల్సిన ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సు లలో నిర్లక్ష్యం వహించకుండా విధిగా వసూలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఆదికారులు, రెవిన్యూ అధికారులు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love