ఎన్నికల ప్రవర్తన నియమావళిని మీడియా తూచా తప్పకుండా పాటించాలి

– కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి
– ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం
– 24 గంటల 1950 టోల్‌ ఫ్రీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు
నవతెలంగాణ-ములుగు
భారత ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినందున ఎన్నికల ప్రవర్తన నియమాలను ప్రింట్‌ , ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్‌ ఆలం, రిటర్నింగ్‌ అధికారి అంకిత్‌ లతో కలిసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో ప్రత్యేక ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు.జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్‌ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ నవంబర్‌ 3న వస్తుందని, నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నవంబర్‌ 13 వరకు నామినేషన్ల స్కూటీని నవంబర్‌ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, నవంబర్‌ 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ నిర్వహణ జరుగుతుందని అన్నారు. ములుగు జిల్లాలో 2వ ఓటరు జాబితా సవరణ తుది ఓటరు జాబితా ప్రకారం , అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్‌ జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు అక్టోబర్‌ 31 వరకు ఓటరు గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని అన్నారు.జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 303 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్‌ కు రెండు కిలోమీటర్ల రేడియస్‌ లో పోలింగ్‌ కేం ద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర బ్యాలెట్‌ యూనిట్లు కంట్రోల్‌ యూనిట్లు వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అన్నారు. వాట్సాప్‌ గ్రూప్‌ లలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా అడ్మిన్లు పూర్తి జాగ్ర త్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అసత్యాలు ప్రసారం చేసినట్లయితే అడ్మిన్‌ లపై ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకొనిబడునని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ అక్రమ నగదు లిక్కర్‌ సరఫరా జరక్కుండా కట్టురితమైన చర్యలు తీసుకు ంటున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయవద్దని, ఒక మతాన్ని గాని ఒక ప్రాంతాన్ని గాని ఒక వ్యక్తిని గాని కించపరిచే వ్యాఖ్యలు చేయవద్దని, ఇలాంటి ప్రచారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈసమావేశంలో ఎంసిఎంసి కమిటీ మెం బర్‌ఎస్‌ శ్రీధర్‌, డిపిఆర్‌ఓ యండి రఫిక్‌, పాత్రికేయులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలక్షన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love