నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ ల్లో ఊర కుక్కల బీభత్సం సృష్టించాయి.అయితే ముదోల్ ల్లో శనివారం ఊర కుక్కలు పదిమందికి గాయపరిచాయి. దీంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో బాధితులు టీకాలు తీసుకున్నారు. ముధోల్ కు చెందిన సంజయ్, యూసుఫ్ ఖాన్, సాయిఖ్, వినోద్ ,ఎస్ డి కలీం, ఎండి కలీం, జ్యోతి, హరిత,రూప,లకు కుక్కల దాడి లో గాయపరిచాయి. పిచ్చి కుక్కలు గ్రామాలలో స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుక్కల దాడిలో గాయమైన వారికి స్థానిక ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు డాక్టర్ సువర్ధన్, డాక్టర్ రాహుల్, డాక్టర్ విజేష్ లు బాధితులకు టీకాలు (ఆంటీ రేబీస్ వ్యాక్సిన్) వేసినట్లు తెలిపారు. అయితే ఇందులో తీవ్రంగా గాయమైన కొందరికి రేబిస్ ఇమ్నోగ్లోబిలిన్స్ కొరకు బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి పంపి నట్లు వైద్యులు పేర్కొన్నారు.