మహాసముద్రం గండిని పరిశీలించిన మంత్రి 

– పర్యాటక ప్రాంతనికి ప్రణాళికలు
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్ గ్రామ శివారులో గల మహాసముద్రం గండిని సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎతైన గుట్టలను కలుపుతూ మద్యలో ఉన్న చెరువును చూడడానికి చాలా మంది పర్యటకులు వస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్నంతటిని ఓక పెద్ద పర్యటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ తొ సమావేశం నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. బైలంపూర్ చెరువులో నీరు ఉంటే  హుస్నాబాద్ లొ భూగర్భ జలాలు పెరుగుతాయని లేకుంటే మీరు అడగండి పోతుందని మంత్రికి స్థానికులు వివరించారు. భూగర్భ జలాలు పెరిగేలా చెరువులు మరమత్తులు ,పర్యటక కేంద్రాన్ని చేసేందుకు కృషి చేస్తామని మంత్రి వివరించారు.
Spread the love