ఫిట్స్‌ వచ్చి పడిపోయిన వ్యక్తిని కాపాడిన మంత్రి

నవతెలంగాణ – రంగారెడ్డి: ఫిట్స్‌ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు కాపాడారు. రాయికోల్‌ టోల్‌గేట్‌ వద్ద ఓ వ్యక్తి ఫిట్స్‌ వచ్చి పడిపోయాడు. కొల్లాపూర్‌కు వెళ్తున్న మంత్రి జూపల్లి ఆయన్ను గమనించి.. అనుచరులతో కలిసి కాపాడారు. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి బాధితుడిని ఆసుపత్రికి పంపించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

Spread the love