దారుణం.. చెరుకు తోటకు నిప్పుపెట్టిన దుండగులు

నవతెలంగాణ-హైదరాబాద్ : జ‌గిత్యాల జిల్లాలో దారుణం జ‌రిగింది. మెట్‌ప‌ల్లి మండ‌లం స‌త్త‌క్క‌ప‌ల్లి గ్రామ స‌మీపంలో ఉన్న మూడు ఎక‌రాల చెరుకు తోట‌కు గుర్తు తెలియ‌ని దుండ‌గులు నిప్పు పెట్టారు. దీంతో క్ష‌ణాల్లోనే మంట‌లు చెరుకు తోట అంత‌టా వ్యాపించాయి. చెరుకు తోట రైతు న‌ల్ల విఠ‌ల్‌కు మంట‌ల‌ను చూసి షాక్ అయ్యారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు తోట‌కు నిప్పంటించిన‌ట్లు రైతు అనుమానం వ్య‌క్తం చేశాడు. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించిందని రైతు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని రైతు తెలిపిన‌ట్లు స‌మాచారం.

Spread the love