ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 35 మంది బాధితులకి 17,21,000/–రూ.ల సీఎంఆర్ఎఫ్- ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులని ఆదివారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..ప్రజా సంక్షేమమే ప్రభుత్వ మొదటి కర్తవ్యం. సీఎంఆర్ఎఫ్ తో మెరుగైన వైద్యం.నిరు పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందని తెలియజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తుంది.ప్రభుత్వ ఆసుపత్రి లలో వైద్య సదుపాయాలు మెరుగు పరిచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాము.గర్భిణీ స్త్రీ లకు సాధారణ ప్రసవాలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు ఆదర్శంగా నిలుస్తున్నాయి.అత్యవసర సమయాల్లో ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నాము. నిజామాబాద్ నగర ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రయివేటు హాస్పటల్ లో చికిత్స పొందితే సంబందీత బిల్లులతో మా కార్యాలయంలో సి ఎం ఆర్ ఎఫ్ దరఖాస్తు చేసుకొంటే వీలయినంత సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ , నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ,సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి చందర్,సత్య ప్రకాష్ బి ఆర్ ఎస్ కార్పొరేటర్ లు,నాయకులు పాల్గొన్నారు.

Spread the love