![](https://navatelangana.com/wp-content/uploads/2024/02/IMG-20240206-WA0022.jpg)
భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన పన్నాల వెంకటరెడ్డి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో మంజూరైన 2,50,000 రూపాయల ఎల్ఓసి చెక్కును మంగళవారం ఎమ్మెల్యే తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మైలారం వెంకటేష్, మండల కార్యదర్శి బొల్లపల్లి అశోక్, నాయకులు గోగు శ్రీనివాస్, తేల్జూరి వెంకటేష్ యాదవ్, మొగిలి పాక ఆనంద్ పాల్గొన్నారు.