అచ్చంపేట అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే 

నవతెలంగాణ –  అచ్చంపేట
ఎస్సీ రిజర్వుడు అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధి కొరకు శుక్రవారం హైదరాబాద్ ముఖ్యమంత్రి ఛాంబర్ లో  అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ని కలిశారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు, విద్య, వైద్యం, వ్యవసాయం, తాగినీరు, సాగునీటి రంగాలకు కేటాయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అచ్చంపేట జెడ్పీటీసీ మంత్రియా నాయక్, ఉప్పునుంతల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, నాయకులు గిరి వర్ధన్ గౌడ్, తదితరులు ఉన్నారు.
Spread the love