నవతెలంగాణ – భిక్కనూర్
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గురువారం హైదరాబాదులో కార్యాలయానికి వెళ్లి పుష్పగుచ్చాలు అందజేసి ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో పాటు, ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ నుండి అనుమతులు ఇప్పించారని, కామారెడ్డి పట్టణ శివారులో నరసన్న పల్లి గ్రామం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని బస్వాపూర్, తలమడ్ల, బీబీపేట, వడ్లూరు ఎల్లారెడ్డి, చిన్న మల్లారెడ్డి , ఈస్సన్నపల్లి, గ్రామాలలో నూతనంగా హెల్త్ సబ్ సెంటర్ ల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.