మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలంలోని అనాజిపురం, చందుపట్ల, అనంతారం గ్రామలలో హెల్త్ సబ్ సెంటర్, బీసీ కమ్యూనిటీ హాల్స్, సిసి రోడ్లు అండర్  గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు (సిపిఎం నాయకురాలు) ఎదునూరి ప్రేమలత మల్లేశం, (సిపిఎం నాయకురాలు) ఎంపిటిసి గునుగుంట్ల కల్పనా శ్రీనివాస్ గౌడ్, చందుపట్ల సర్పంచ్ చిన్నం పాoడు, ఎంపీటీసీ బొక్క కొండల్ రెడ్డి, అనంతరం సర్పంచ్ చిందం మల్లికార్జున్, సామల వెంకటేష్, టిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు జనగాం పాండు, నీల ఓం ప్రకాష్ గౌడ్, నాయకులు జక్క రాఘవేందర్ రెడ్డి, జమ్ముల రమేష్, సిల్వేరు మధు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతారంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ..
     భువనగిరి మండలం అనంతారం గ్రామంలో అభివృద్ధి పనులు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తున్నప్పుడు గ్రామానికి సంబంధించిన దళితులు దళిత బంధు పథకం ఎప్పుడు ఇస్తారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ సందర్భంలో టిఆర్ఎస్ నాయకులు జనగాం పాండు వారితో దురుసుగా ప్రవర్తించి వారిని బెదిరించినట్లు ఆరోపించారు.  మహిళలను చూడకుండా దుర్భాషలాడినట్లు మహిళలు ఆరోపించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సర్దుమనిపించారు.
Spread the love