– విధాన నిర్ణయాలన్నీ ఆయనవే
– నామ్‌కేవాస్తేగా రైల్వే మంత్రి
– ఓట్ల కోసమే కొత్త రైళ్లు, ప్రాజెక్టులు
– కాంట్రాక్ట్ సిబ్బంది చేతికి కీలక విధులు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ పాలనలో భారతీయ రైల్వే పట్టాలు తప్పింది. ఆ శాఖకు గ్రహణం పట్టింది. ప్రమాదాలు జరగడం, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా గత సంవత్సరం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఈ ఏడాది కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయి. ఈ రెండు ప్రమాదాలపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రైల్వే భద్రతా కమిషనర్ ప్రాథమిక విచారణను పూర్తి చేశారు. కోరమాండల్ ప్రమాదంపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. రైల్వేలో చోటుచేసుకుంటున్న వివిధ ప్రమాదాలపై విశ్లేషణలు అందించడంలో ‘ది వాల్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ సీనియర్ ఎడిటర్ అమల్ సర్కార్‌కు విశేష అనుభవం ఉంది. రైలు ప్రమాదాలపై అమల్ సర్కార్ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం…ఇప్పుడు భారతీయ రైల్వేలకు విడిగా ఓ బడ్జెట్ అంటూ లేదు. విధాన నిర్ణయాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీవే. ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాతే కొత్త రైళ్లు లేదా మార్గాలు ప్రవేశపెట్టాలని ప్రధాని గతంలో నిర్ణయించారు. కాబట్టి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసేందుకు పెద్దగా పనేమీ ఉండదు.
సాధారణంగా గతంలో రైల్వే బడ్జెట్ విడిగా ఉండేది. ఇపుడు సాధారణ బడ్జెట్‌లో అంతర్భాగమైంది. రైల్వేలను ప్రభుత్వాలు తమ ప్రచారానికి వాడుకునేవారు. ఇపుడు మోడీ నేరుగా తన స్వంత డబ్బా కోసం వాడుకుంటున్నారు. మోడీ క్యాబినెట్ సహచరులు ఆయనను అనునిత్యం కీర్తిస్తూ, ఆయన్ని ‘సూపర్ ప్రధాని’గా మార్చేశారు. ఈ నేపథ్యంలోనే మోడీ అకస్మాత్తుగా ‘వందేభారత్’ రైళ్లను ప్రవేశపెట్టారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులనే ముందుగా పూర్తి చేయాలన్న తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే రైల్వే శాఖ మాజీ మంత్రులు మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి వారు ప్రకటించిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి వచ్చేది. విశాలమైన భారతీయ రైల్వేల సామ్రాజ్యంలో కనీసం ఒక్కటైనా మోడీ సంతకం చేసిన ప్రాజెక్ట్ లేకపోతే ఎలా? ఆ విధంగా ప్రారంభమైందే వందే భారత్ రైళ్లు.
డిటర్జెంట్ సబ్బు వంటిదే…
కొత్త రైళ్ల ప్రారంభంపై ఓ అధికారి ఇలా వ్యాఖ్యానించారు ‘మార్కెట్‌లో ఉన్న డిటర్జెంట్ సబ్బు పేరుకు ముందు కొంత కాలం తర్వాత సూపర్, ఎక్స్‌ట్రా సూపర్, ఎక్స్‌ట్రా వైట్, ఎక్స్‌ట్రా బ్రైట్ అని పేర్లు చేరిస్తే ఎలా ఉంటుందో ఇదీ అలాంటిదే. సబ్బు ప్యాకెట్‌లో ఉండే పదార్థంలో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం పేరులోనే సూపర్, ఎక్స్‌ట్రా వంటి పదాలను చేరుస్తారు. కొత్త రైళ్ల వ్యవహారం కూడా ఇలాంటిదే’.
సమయపాలన ఎక్కడీ
2022 అక్టోబరులో 130 జనరల్ మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్‌గా మార్చేసి ఛార్జీలు పెంచారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ రైళ్లలో ఎలాంటి తేడా లేదు. ఒక లెక్క ప్రకారం 2022 జనవరి-సెప్టెంబర్ మధ్య ఈ సూపర్‌ఫాస్ట్ రైళ్లు 2,00,10,000 గంటల ఆలస్యంగా నడిచాయి. సరిపడినన్ని ట్రాక్‌లు లేకపోవడమే దీనికి కారణం. మొత్తం 12,524 రైళ్లలో వెయ్యి రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టారు. నాయకులు, మంత్రుల రాజకీయ అవసరాల కోసమే కొత్త రైళ్లను పట్టాలు ఎక్కించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయపాలనకు సంబంధించి స్వయం ప్రకటిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన చోట కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. వైఫల్యాలను కప్పిపుచ్చడానికే వీటిని నడిపారు. రైళ్లు షెడ్యూలు ప్రకారం నడిస్తే కొత్త వాటి అవసరం ఏముంటుంది? ప్యాసింజర్, గూడ్సు రైళ్లు నడిచే పట్టాల పైనే బులెట్ రైళ్లు లేదా హై-స్పీడ్ రైళ్లను నడపడం అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టడమే అవుతుంది. రైళ్ల సమయపాలనపై కాగ్ కూడా అక్షింతలు వేస్తోంది. గత పదేండ్ల కాలంలో దేశంలో రైళ్ల సగటు వేగం కేవలం 3.5 శాతం మాత్రమే పెరిగిందని, ఇదేమీ గొప్ప ముందడుగు కాదని కాగ్ తన 2022 నివేదికలో ఎత్తిచూపింది.
ఓట్ల కోసమే రైళ్లు, ప్రాజెక్టులు
వైష్ణవ్ ప్రస్తుతం రైల్వే శాఖకు నామమాత్రపు మంత్రి మాత్రమే. ఆ మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డు కార్పొరేట్ ఛైర్మన్-కమ్-సీఈఓ నాయకత్వాన, ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. పైగా వైష్ణవ్ రైల్వేకు మాత్రమే మంత్రి కాదు. ఐటీ, సమాచార ప్రసార శాఖలకూ ఆయనే మంత్రి. రైల్వేలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంలో గత ప్రధానుల దారిలోనే మోడీ నడుస్తున్నారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం, నిధులతో నాటి ప్రధాని పి.వి. ఈ ప్రాజెక్టును నిర్మించారు.
కేవలం ఓట్ల కోసమే అసంపూర్తి ప్రాజెక్టుకు ప్రధాని ప్రారంభోత్సవం చేశారని ఆరోపణలు వచ్చాయి. జపాన్ అభ్యంతరాలను రైల్వే శాఖ కానీ, ప్రధాని కార్యాలయం కానీ పట్టించుకోలేదు. 29 ఏండ్లు గడిచిన తర్వాత సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ పలు వందేభారత్ రైళ్లకు పచ్చజెండాలు ఊపారు. ఇది కూడా ఓట్ల కోసమేననేది నిర్వివాదాంశం.
కాంట్రాక్ట్ సిబ్బందే ఆధారం
ఇప్పుడు రైల్వే శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను కాంట్రాక్టర్లే సరఫరా చేస్తున్నారు. వారికి నైపుణ్యం కానీ, అనుభవం కానీ ఉండదు. కాంట్రాక్టర్లు ఇచ్చే తక్కువ జీతాలకు నిపుణులు, శారీరక దారుఢ్యం కలిగిన వారు రావడం లేదు. ఇప్పుడు దినసరి కార్మికులే సాంకేతిక విభాగాన్ని, నిర్వహణను చూసుకుంటున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే జవాబుదారీ వహించే వారే లేరు. రైల్వేలో కాంట్రాక్ట్ సంస్థల హవా కొనసాగుతోంది. అధికారులకు తెలియకుండానే ప్రయివేటు సంస్థల ఉద్యోగులు పట్టాలపై పనిచేస్తుంటారు. రైల్వేలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఫలితంగా ప్రస్తుత ఉద్యోగుల పైనే అధిక పని భారం పడుతోంది. రైల్వే శాఖకు ప్రస్తుతానికి పోటీ లేదు. అది ఏకచ్ఛత్రాధిపత్యం సాగిస్తోంది. ఎక్కడ చూసినా మోడీ ఫొటోలు, సెల్ఫీ పాయింట్లే కన్పిస్తుంటాయి. నరేంద్ర మోడీని రైల్వే మంత్రి అని ఎవరైనా అనుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒడిశా ఐపీఎస్ అధికారి వైష్ణవ్ ఉత్సవ విగ్రహమే!
డిటర్జెంట్ సబ్బు వంటిదే…
కొత్త రైళ్ల ప్రారంభంపై ఓ అధికారి ఇలా వ్యాఖ్యానించారు ‘మార్కెట్‌లో ఉన్న డిటర్జెంట్ సబ్బు పేరుకు ముందు కొంత కాలం తర్వాత సూపర్, ఎక్స్‌ట్రా సూపర్, ఎక్స్‌ట్రా వైట్, ఎక్స్‌ట్రా బ్రైట్ అని పేర్లు చేరిస్తే ఎలా ఉంటుందో ఇదీ అలాంటిదే. సబ్బు ప్యాకెట్‌లో ఉండే పదార్థంలో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం పేరులోనే సూపర్, ఎక్స్‌ట్రా వంటి పదాలను చేరుస్తారు. కొత్త రైళ్ల వ్యవహారం కూడా ఇలాంటిదే’.